ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 29 వినతులు.
నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 29 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా, ఎనిమిది మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి. మునికృష్ణ, కార్పొరేటర్ దూది కుమారి లు కమిషనర్ ను కోరారు. కాగా వర్షాల సమయంలో అత్తూరు డాబా ఎదురుగా రోడ్డు పై నిలిచినా నీటిని తమ పొలంలోకి మళ్ళిస్తున్నారని, ఈ ఇబ్బందిని తొలగించాలని, న్యూ బాలాజీ కాలనీలో అనుమతులు లేకుండా చేస్తున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వృద్దాప్య పింఛన్ ఇప్పించాలని, మెప్మా నిర్వహిస్తిన్నా పొదుపు సంఘాల పుస్తకాలు కొనుగోలు, సభ్యత్వాల రుసుముకు రిసిప్ట్ ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతున్నారు చర్యలు తీసుకోవాలని, సుభాష్ నగర్ నందు సిసి రోడ్లు, కాలువలు వేయాలని, అశోక్ నగర్ గంగమ్మ గుడి వద్ద త్రాగునీటిలో మురుగు నీరు కలుస్తున్నాయి అరికట్టాలని, అక్కారంపల్లి మునిసిపల్ స్కూల్ నందు బోరు మోటార్ మరమ్మతులు చేయించాలని, భూగర్భ డ్రైనేజి లీకేజి లను అరికట్టాలని, వివి మహల్ రోడ్డు డివైడర్ల మధ్య ఖాళీ స్థలం ఫిల్ చేయాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.
