లెనిన్ నగర్లో స్ట్రీట్ లైట్ ను ఏర్పాటు చెయ్యండి.
ప్రజావాణిలో సీపీఐ నాయకులు వినతి.
గాజులరామరం సర్కిల్ లెనిన్ నగర్ సి బ్లాక్ చౌరస్తా లో వీధి దీపాలు లేకపోవడం వల్ల రాత్రి సమయంలో మహిళలు అక్కడి నుండి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని, పోకిరీలు గంజాయి మందు సేవించి అర్ధరాత్రి సమయంలో గొడవలు అల్లర్లు సృష్టిస్తూ భయాన్ని సృష్టిస్తున్నారని కావున అక్కడ స్ట్రీట్ లైట్ ఇమాస్ లైట్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,మండల కార్యదర్శి స్వామి,ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి సధనంద్,సాయిలు ,కుమార్,సత్యం,రవి,మధు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు
