ఘనంగా రాచాల జన్మదిన వేడుకలు

TEJA NEWS

ఘనంగా రాచాల జన్మదిన వేడుకలు

భారీగా హాజరైన అభిమానులు

విజయవంతమైన రక్తదాన శిబిరం
వనపర్తి :

బిసి పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

రాచాల జన్మదినాన్ని పురస్కరించుకుని పెబ్బేరు పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాలులో నిస్వార్థ ఆర్గనైజేషన్ మరియు రాచాల యుగంధర్ బీసీ పొలిటికల్ జెఎసి సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

రక్తదాన శిబిరంలో రాచాల అభిమానులు యువకులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని 114 యూనిట్లు రక్తదానం చేశారు.

జిల్లా వ్యాప్తంగా యువత మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాచాల యుగందర్ గౌడ్ కి శాలువాలతో సన్మానించి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ.సందర్బంగా అభిమానులను ఉద్దేశించి రాచాల మాట్లాడుతూ బిసి పొలిటికల్ జెఎసి సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని, భావితరాల భవిష్యత్ కోసం అనునిత్యం కృషి చేస్తానన్నారు.

పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా రాకెట్ స్పీడుతో వాలిపోతానని, సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేయడమే తన లక్ష్యమన్నారు.

అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ నిలబడి పోరాటం చేసి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

ప్రజల మద్దతుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు మరింత సేవ చేస్తామని స్పష్టం చేశారు.

స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి తనను ఆశీర్వదించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నిస్వార్థ ఆర్గనైజేషన్ సిబ్బందిని నిర్వాహకులు సన్మానించారు.

అంతకుముందు ఆయన స్వగ్రామం వడ్డెవాట గ్రామంలో తల్లి నాగేంద్రమ్మ ఆశీర్వాదం తీసుకుని అనంతరం బీచుపల్లి ఆంజనేయస్వామిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిస్వార్థ ఆర్గనైజేషన్ సిబ్బందితో పాటు నిర్వాహకులు వివి గౌడ్, రాఘవేందర్, దేవర శివ, అంజన్న యాదవ్,మహేందర్ నాయుడు, ధర్మేంద్ర సాగర్, బత్తుల జితేందర్ , సూగూరు రాజశేఖర్, సితార వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ గౌడ్,రంగస్వామి వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top