జిల్లాలోని మున్సిపాలిటీలకు నిధులు పెంచాలని సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
పేదలకు ఇచ్చిన పట్టాల కు స్థలాలు చూపి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
డబల్ బెడ్ రూమ్ల వద్ద కనీస వసతులు కల్పించాలి
వనపర్తి
రాష్ట్రంలో ఫీచర్ సిటీల పేరుతో ఎక్కువ నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వనపర్తి మున్సిపాలిటీకి, మరియు పెబ్బేరు,కొత్తకోట,అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీలకు నిధులు పెంచాలని సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి పుట్ట ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. జిల్లాకుకేటాయించిన నిధులను 5 మున్సిపాలిటీలకు వైకుంఠధామాలకు కూరగాయల మార్కెట్లకు కేటాయించిన నిధులను నేటికీ ఖర్చు చేయలేదని వాటిని ఖర్చు చేసి పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.వనపర్తి పట్టణ దళిత వాడకు స్మశాన వాటిక కు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. నేటికి స్లమ్ము ఏరియాలలో అభివృద్ధి పనులు జరగడం లేదని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు.వనపర్తిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి అయిన నేటికీ దాన్ని ప్రారంభించకపోవడం ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వెంటనే దాన్ని ప్రారంభించాలని కోరారు. వనపర్తి కందకంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను పూర్తి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మర్రికుంట దగ్గర సూర్య చంద్ర స్కూల్ దారిలో కొత్తగా కలువెట్టు నిర్మాణం చేసి డ్రైనేజీ నీరు పోయే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మర్రికుంటలో అలుగు నీరు పోవడానికి జరిపిన కాల్వ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చిట్యాల డబుల్ బెడ్రూం, అప్పయ్యపల్లి శివారులోని డబల్ బెడ్ రూమ్, పీర్లగుట్ట డబుల్ బెడ్ రూమ్, రాజపేట దగ్గర ఉన్న డబల్ బెడ్ రూమ్, పెద్దగూడెం శివారులో ఉన్న డబల్ బెడ్ రూము లలో కనీస వసతులు కల్పించాలని, నీటి వసతి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గృహకల్ప లో వసతులు అస్తవ్యస్తంగా ఉన్నాయని వాటిని పూర్తి చేయాలని అన్నారు. అమరచింతలు లో పేదలు ఇళ్లస్థలాల పట్టాలు ఉన్నవారు ఇతర పేదలు రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి స్థలాలు చూపి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. వనపర్తి పట్టణంలోని 970 సర్వే నెంబరు పీర్లగుట్ట,మబ్బుగుట్ట, అప్పాయిపల్లి శివారులలో 685 మందికి 2008 అక్టోబర్లో ఇళ్లస్థలాలు పట్టాలి ఇచ్చి నేటికీ వారికి ఈ స్థలాలు చూపలేదని అట్టి పేదలకు స్థలాలు చూపి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. చిట్యాల శివారులో ఉన్న డబల్ బెడ్ రూమ్ ప్రాంతంలో గతంలో పేదలకు ఇళ్లస్థలాలు పట్టాలి ఇచ్చి అట్టి స్థలంలో డబుల్ బెడ్ రూమ్ కట్టి మీకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వారికి న్యాయం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. రాజు , జిల్లా నాయకులు బొబ్బిలి నిక్సన్,డి.కురుమయ్య, గంధం మదన్, జి గట్టన్న,నందిమల్ల రాములు, బీసన్న, సాయి లీల, ఉమా,ఈ పురుషోత్తం, ఊసన్న తదితరులు పాల్గొన్నారు
