లేబర్ కోడ్ ఉత్తర్వు కాపీల దగ్ధం

TEJA NEWS

లేబర్ కోడ్ ఉత్తర్వు కాపీల దగ్ధం

** పాల్గొన్న సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు

తిరుపతి: కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్య ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లు అమలు కోసం శనివారం జారీ చేసిన ఉత్తర్వు కాపీలను తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటీయూసీ నేతలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రమణ్యం, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాధాకృష్ణ మాట్లాడుతూ కార్పోరేట్ల ప్రయోజనాల కోసం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాయడానికి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని విమర్శించారు. బీహార్ ఎన్నికల తర్వాత లేబర్ కోడ్లు అమలు చేయడం అంటే కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేసినట్లేనని అన్నారు. ఈ చట్టాలు అమలు వల్ల ఎనిమిది గంటల పని విధానం 13 గంటల పని విధానంతో చట్టంగా మారుతుందన్నారు. సమ్మెలు చేసే హక్కు, సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేయడం కోసం ఈ చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. మహిళలతో రాత్రి వేళలో కూడా డ్యూటీలు చేయించాలని తీసుకొచ్చిన చట్టం వల్ల మహిళా కార్మికులకు రక్షణ, భద్రత లేకుండా పోతుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 10 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లు కార్మిక వర్గానికి ద్రోహం చేశారని. లేబర్ కోడ్లు రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికవర్గ వ్యతిరేక విధానాలను కార్మిక వర్గంలోకి విస్తృతంగా తీసుకెళ్లి ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్. జయచంద్ర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు జి.బాలసుబ్రమణ్యం, పి.మునిరాజా, ఆర్.లక్ష్మి, ఎన్.మాధవ్, కే.వేణుగోపాల్, పి.బుజ్జి, పి.చిన్న, నరేంద్ర, ఎండి శ్రీనివాసులు, శ్రీరాములు, నారాయణస్వామి, రఘు, హమాలి రమేష్, ఆనందు, పరశురాం, మురళి, బాదుల్లా, ఏఐటీయూసీ నాయకులు ఎన్ డి.రవి, మహేంద్ర, శ్రీరాములు, కేవై రాజా, సర్దార్ శివ, వెంకటేష్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top