స్వ‌ర్ణ‌ర‌థంపై సిరులతల్లి ఆశీర్వాదం

TEJA NEWS

స్వ‌ర్ణ‌ర‌థంపై సిరులతల్లి ఆశీర్వాదం

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సాయంత్రం అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది. కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు. ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఎస్ ఇ- 3 జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top