ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ స్నేహ శబరీష్ గారు….
హన్మకొండ జిల్లా లోని హసన్పర్తి, ఐనవోలు మండలాల్లోని మహిళలకు నేడు హన్మకొండ హరిత కాకతీయ హోటల్ నందు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు…
తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ:-…
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని, గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలను మహిళలు పొలాల వద్ద కట్టేవారని, తాను పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మహిళలు తమ పొలాల వద్ద చీరలు కట్టడాన్ని చూశానని, ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని, చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు సీతక్క, కొండా సురేఖ మొదటి నుంచి పరిశీలిస్తూ అద్భుతమైన డిజైన్లలో నాణ్యతతో చీరలను రూపొందించారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఉచిత బస్సుపై ప్రతిపక్ష పార్టీలు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు..
గత పాలకులు తెలంగాణను అప్పుల మయంగా మార్చిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు…
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామని, ప్రజా ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.
ఆంధ్ర పాలకులు దోచుకున్న దానికంటే అధికంగా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచేసిందని, హరీష్ రావు వందల కోట్లు సంపాదించారని కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. అధికారం పోయిన కేటీఆర్ కు అహంకారం తగ్గలేదని, అహంకారంతో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కేటీఆర్ కు తగిన బుద్ధి చెప్పారన్నారు…
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసి రాణించాలని అన్నారు…
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు హాసన్ పర్తి, ఐనవోలు మండలాల సమైక్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు….
