ఎమ్మెల్యే నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన హన్మకొండ డిసిసి అధ్యక్షుడు KUDA చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి .

TEJA NEWS

ఎమ్మెల్యే నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన హన్మకొండ డిసిసి అధ్యక్షుడు KUDA చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి ..

హన్మకొండ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన సందర్భంగా నేడు KUDA చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* ని శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు హన్మకొండ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా నూతన నియామకం పొందిన ఇనుగాల వెంకటరామిరెడ్డి ని శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి తన శుభాకాంక్షలను తెలియజేశారు….

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top