నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

TEJA NEWS

నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా జరగబోయే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి కిషోర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరాటి రమేష్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ రైతాంగ సమస్యల మీద దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని , ముఖ్యంగా కనీస మద్దతు ధర స్వామినాధన్ సిపార్సులు అమలు గ్యారెంటీ చేయాలని, రైతులకు వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలని, ఇప్పటికే రుణగ్రహితులైన రైతులపై చట్ట విరుద్ధ వేధింపులు ఆపి రైతులకు వడ్డీ లేని రుణాన్ని అమలు చేయాలని దీని కోసం ఆర్బిఐ, నాబార్డ్ కి నిధులు కేటాయించాలని కార్మికులకు రక్షణగా ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్టులను తెచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మళ్ళీ దేశ వ్యాపిత ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఊకంటి రవి కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పోతుగంటి లక్ష్మణ్, నకిరేకంటి నాగేశ్వరరావు, అనుమల సాయి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top