తిరుపతి ఐఐటీలో ఐఎల్.సీసీ సదస్సు ప్రారంభం

TEJA NEWS

తిరుపతి ఐఐటీలో ఐఎల్.సీసీ సదస్సు ప్రారంభం

** ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ

తిరుపతి: తిరుపతి ఐఐటీ కాలేజీలో మూడు రోజులపాటు జరగనున్న ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్‌ (ఐఎల్.సీసీ) ప్రారంభమయింది. ఇందులో రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రికి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, లీన్ కన్స్ట్రక్షన్ సభ్యులు, ప్రొఫెసర్లు ఘనస్వాగతం పలికారు. ముందుగా
ఐఐటీలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను మంత్రి నారాయణ పరిశీలించి వివరాలు తెలుసున్నారు. ఈ సందర్బంగా టెక్నాలజీ వినియోగంపై విభాగాధిపతులు మంత్రికి వివరించారు. అనంతరం
మంత్రి నారాయణ మాట్లాడుతూ…మూడు రోజుల సెమినార్ కు దేశంలోని వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా హాజరవడం….ఇందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ రంగంలో వృధాను, సమయాన్ని తగ్గించటంతో పాటు మనీ సేవింగ్ అంశాలపై లీన్ కన్స్ట్రక్షన్ పని చేస్తోందన్నారు.


ఐఎల్సీఈ ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. లీన్ కన్స్ట్రక్షన్ పని విధానంతో నిర్మాణ ప్రాజెక్టులు సకాలంలో, మంచి నాణ్యతతో పూర్తవుతాయని చెప్పారు.
ప్రధానంగా మునిసిపల్, పట్టణ అభివృద్ధిలో – ఈ పని విధానం చాలా సందర్భోచితంగా ఉంటుందని తెలిపారు.
అదే తరుణంలో నిర్మాణ సవాళ్లకు లీన్ కన్స్ట్రక్షన్ ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తుందన్నారు.
మున్సిపాల్టీల్లో జరుగుతున్న పనులకు లీన్ కన్స్ట్రక్షన్ సేవలు వాడుకొంటామని చెప్పారు. మొదటగా ఒక చోట ఫైలెట్ ప్రాజెక్ట్ చేపడతామని వివరించారు.

You cannot copy content of this page

Scroll to Top