మంత్రికి “సూపర్ సిక్స్” మెమెంటోతో సన్మానం
తిరుపతి: జిల్లా పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు “సూపర్ సిక్స్ జ్ఞాపిక”ను అందజేసి టీడీపీ, కూటమి నేతలు ఘనంగా సన్మానించారు. వారిలో టీడీపీ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ, ఉన్నారు. అనంతరం మంత్రితో కలసి సామాజిక పెన్షన్ల పంపిణీలో నాయకులు పాల్గొన్నారు.
