శంకర్‌పల్లిలో భక్తిశ్రద్ధలతో గీతా జయంతి ఉత్సవాలు

TEJA NEWS

శంకర్‌పల్లిలో భక్తిశ్రద్ధలతో గీతా జయంతి ఉత్సవాలు

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని గీతామందిర్ ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు బెజగం రాజేశ్వర్ పద్మావతి దంపతులచే పురోహితులు రాజేశ్వర్ జోషి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ భగవానుడిని పూలతో సుందరంగా అలంకరించారు. హోమం నిర్వహించారు. మహిళలు గీతా పారాయణం చేశారు. జై గీత, జై శ్రీ కృష్ణ నినాదాలతో ఆలయం మారు మ్రోగింది. అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మహిళలు, పుర ప్రముఖులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top