వేతనాల పెంపుకై నేటి నుంచి ఆసుపత్రి కార్మికుల ఆందోళన బాట
డిసెంబర్5న చలో హైదరాబాద్.
డిమాండ్ నోటిస్ అందజేసిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాల కార్మికులు.
వనపర్తి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ కళాశాలలో కాల పరిమిత ముగిసిన పాత ఐహెచ్ఎఫ్ఎంఎస్ ఏజెన్సీ టెండర్లను రద్దుచేసి వాటి స్థానంలో నూతన టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని,పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనం 26వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పడుతున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ తెలిపారు.సోమవారం జీతాల పెంపు కోసం చేపట్టబోయే ఆందోళన డిమాండ్ నోటీసులు వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ యం ఓ డాక్టర్ శివప్రసాద్ కి, వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున కి అందజేశారు.
ఈ సందర్భంగా పి. సురేష్ మాట్లాడుతూ:-ప్రభుత్వ దవాఖానలో శానిటరీ భద్రత రోగి సంరక్షణ కోసం ప్రభుత్వం మూడు సంవత్సరాలకోసారి ప్రభుత్వం ఐహెచ్ఎఫ్ఎంఎస్ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేసే విధానం అమలు జరుగుతుందని తెలిపారు.2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం టెండర్ల ద్వారా ప్రస్తుత నడుస్తున్న ఏజెన్సీలను నియమించారని వాటి మూడు సంవత్సరాల కాల పరిమితి దాటి ఆరు నెలల గడుస్తున్నదని అయినా ఇప్పటికీ కొత్త ఏజెన్సీల ఏర్పాటు ప్రక్రియని ప్రభుత్వం ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో కార్మికులు తీవ్రమైన ఆర్థిక నష్టంతోపాటు మొయ్యలేని పని భారం పెరిగిపోయిందని అన్నారు.గత టెండర్లలో కొన్ని తప్పిదాల కారణంగా ఏజెన్సీ కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా కార్మికుల శ్రమను దోచుకున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచుతూ నూతన టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి నాలుగో తేదీ వరకు రోజు ఒక గంట ఆసుపత్రుల ఎదుట వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగించి ఈనెల ఐదున చలో హైదరాబాద్ పేరిట డి యం ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి వెట్టి చాకిరికి గురవుతున్న ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు గంధం శ్రీనివాస్, నరసింహ, నరేందర్, కుమార్,అనిల్, శ్రీకాంత్, రవి, శివ, కిషోర్,చంద్రశేఖర్, వెంకటయ్య, భరత్, రవి, పవన్ కళ్యాణ్, కళావతి,జయశ్రీ, ఇందిరా,భాగ్యమ్మ, స్వాతి, లక్ష్మీ పార్వతి, గోవిందమ్మ, యాదమ్మ, నరసమ్మ, పీరమ్మ,రాజేశ్వరి,లక్ష్మి, గోవిందమ్మ, సుజాత, రాజేశ్వరి, శారదా, లావణ్య, సైదా బేగం, భారతి,రమ్య, ఈశ్వరమ్మ,శ్రీదేవి, బొజ్జమ్మ, జయలక్ష్మి, శివ లీల, సుధా, లతా, అంజనమ్మ,నరసింహ, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
