మామిడి యాదగిరి కుటుంబానికి రక్షణ కల్పించాలి
సూర్యాపేట జిల్లా : తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం లో మామిడి యాదగిరి యాదవ్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని అఖిల భారత యాదవ మహాసభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్దంగా గెలవ లేరని భయం తో యాదగిరి యాదవ్ ను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం కోసం కారులో కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యాదవులు ఐక్యంగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం లో యాదవుల పై దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, వెంకట్ యాదవ్, బయ్యా మల్లికార్జున్ యాదవ్, దాసరి వెంకన్న యాదవ్, కంబాల పల్లి శ్రీనివాస్ యాదవ్, కోడి లింగయ్య యాదవ్, గొడ్డెటి సైదులు యాదవ్, పచ్చిపాలా శ్రీనివాస్ యాదవ్, ఎరుపులా లింగయ్య యాదవ్, కంచుగట్ల శ్రీనివాస్ యాదవ్, జానయ్య యాదవ్,కుర్ర నర్సయ్య యాదవ్,తదితరులు ఉన్నారు.
