హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ మెయిన్ రోడ్

TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ మెయిన్ రోడ్ వద్ద సెవెరేజ్ లైన్ మరియు స్ట్రాం వాటర్ లైన్లు బ్లాక్ అయ్యి చుట్టుపక్కల కాలనీలలో ప్రతి రోజు డ్రైనేజ్ పొంగుతున్నదని కాలనీ వారి సమాచారం మేరకు GHMC ఇంజనీరింగ్ మరియు జలమండలి అధికారులతో కలిసి పరిశీలించి తక్షణమే శుభ్రపరచాలని అధికారులతో చెప్పిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, సెవెరేజ్ లైన్ మరియు స్ట్రాం వాటర్ లైన్లు బ్లాక్ అయ్యి చుట్టుపక్కల కాలనీలలో ప్రతి రోజు డ్రైనేజ్ పొంగుతున్నదని కాలనీ వారి సమాచారం మేరకు GHMC ఇంజనీరింగ్ మరియు జలమండలి అధికారులతో కలిసి పరిశీలించి తక్షణమే శుభ్రపరచాలని అలానే జలమండలి అధికారులను బకెట్ క్లీనింగ్ చేయించాలని చెప్పడం జరిగింది, అలానే జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సిల్ట్ క్లీనింగ్ చేయడం దగ్గరుండి పరిశీలించడం జరిగిందని చెప్పడం జరిగింది, అలానే ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అలానే పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని,  అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదితామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ రాజీవ్ , వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, HMWSSB అడిషనల్ DGM శివ గారు, వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, వారి సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top