గీతామృతం వారి ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుక

TEJA NEWS

గీతామృతం వారి ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుక

కోదాడ : కోదాడ పట్టణంలో ఘనంగా భగవద్గీత పారాయణం, గీత జయంతిని పురస్కరించుకుని కోదాడ పట్టణంలో భగవద్గీత పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాశీనాథం కళ్యాణ మండపంలో ‘గీతామృతం టీం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా మహిళా భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ ఏకకాలంలో గీతలోని 18 అధ్యాయాలను పారాయణం చేశారు.భగవద్గీత పారాయణం ప్రతి ఇంట జరిగితే సమాజం సుభిక్షంగా ఉంటుందని నిర్వాహకులు పబ్బ గీతాదేవి, వోరుగంటి రమాదేవి తదితరులు ఆకాంక్షించారు. ఇంతటి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు మేళ్లచెరువు కోటేశ్వరావు, చంద్రకళ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యాదరాణి, మంజుల, వంకాయల స్వాతి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top