జాతరలో పాల్గొన్న “తుడ” చైర్మన్ డాలర్స్

TEJA NEWS

జాతరలో పాల్గొన్న “తుడ” చైర్మన్ డాలర్స్

** నాలుగు గంగమ్మలకు ప్రత్యేక పూజలు

చంద్రగిరి: పట్టణంలో జరిగిన నాలుగు గంగమ్మల జాతర మహోత్సవంలో “తుడ” చైర్మన్ అండ్ టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ముందుగా జమ్మండ్ల వీధి, ఆకుతోట నడి వీధి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నడివీధి గంగమ్మ ఆలయాలకు విచ్చేసిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికి, దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, బంధు మిత్రులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top