ఘనంగా పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి వేడుకలు

TEJA NEWS

ఘనంగా పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి వేడుకలు

  • ఘంటసాల పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు

వనపర్తి :

సిటిజన్ న్యూస్ సీఈఓ మరియు వనపర్తి కళాకారుల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతిని పురస్కరించుకొని స్వరాంజలి కార్యక్రమం జిల్లా సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో కార్యనిర్వాహకులు,జర్నలిస్టు డి.రవిప్రసాద్ ను కళాకారులు శాలువాతో సన్మానించి అభినందించారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజాన్ని పీడిస్తున్న అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపేందుకు ఇలాంటి వేదికలు ఎంతైనా అవసరమని వాటిని ప్రోత్సహించడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జబ్బార్, గంధం నాగరాజు, గాయకులు, గాయనీ మనులు రిటైర్డ్ టీచర్ సత్తార్, నందిమల్ల రాములు, ఉపాధ్యాయులు రవిప్రసాద్ గౌడ్, గంధం రాజు, వెంకట్ పి ఈ టి, ఉపాధ్యాయురాలు శ్రీమతి సుజాత, ఉపాధ్యాయులు నరేందర్, బ్రహ్మయ్య చారి, కార్యక్రమ నిర్వాహకులు గంధం రవి, మోహన్, సంజీవరావు మరియు సంగీత అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top