15వ తేదీ నుంచి హెల్మెట్ తప్పనిసరి

TEJA NEWS

15వ తేదీ నుంచి హెల్మెట్ తప్పనిసరి

** హెల్మెట్ లేకుంటే పెట్రోల్ బంకుల్లో “నో పెట్రోల్”

** ద్విచక్ర వాహనదారులకు పోలీస్ శాఖ విజ్ఞప్తి.

తిరుపతి: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో సుమారు 45శాతం మరణాలు ద్విచక్ర వాహనదారుల మితిమీరిన వేగం…. హెల్మెట్ లేకుండా ప్రయాణం వల్ల జరుగుతున్నవని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అదే సమయంలో 40శాతం మరణాలు హెల్మెట్ వాడకం వల్ల తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా జాతీయ గణాంకాలు సూచిస్తున్నాయి. సరియైన రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే కుటుంబంలో ఒకరు మరణిస్తే కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది.


ఈ నేపధ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు…. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాలో నో హెల్మెట్ – నో పెట్రోల్ నిబంధనలను అమలు చేయాలని అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రజలకు, విద్యావంతులైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువత అందరూ ద్విచక్ర వాహనదారులు… వాహనం నడుపుచున్నవారు….వెనుక కూర్చొని వున్నవారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top