గోపాల్ పేట సర్పంచ్ గా ఎల్లెపోగుల సువర్ణనుగెలిపించాలని
—-బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి
వనపర్తి
గోపాల్ పేట సర్పంచిగా అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎల్లెపోగుల సువర్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
గోపాల్ పేట మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్తి సువర్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించి మాట్లాడారు.
గత ప్రభుత్వం గోపాల్ పేటను అభివృద్ధి చేయటంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
అభ్యర్థి సువర్ణ ఉన్నత విద్యావంతురాలని, ఆమె భర్త ఆంజనేయులు కూడా యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి, న్యాయవాద వృత్తిలో ఉంటూ ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారన్నారు.
ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై అవగాహన ఉండి,వాటి పరిష్కారానికి కృషిచేసే సువర్ణ ఆంజనేయులు ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు దేవర శివ, వివి గౌడ్, అంజన్న యాదవ్,చెలిమిల్ల రామన్ గౌడ్, రమేష్, కాంగ్రెస్ పార్టీ గోపాల్ పేట సర్పంచిగా అద్యక్షులు శివన్న, శేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
