14న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి రాక
** “అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” ర్యాలీ
తిరుపతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఈనెల 14న తిరుపతిలో పర్యటిస్తారని జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, జిల్లా నాయకుడు గవ్వల అశోక్ తెలిపారు. ఆరోజు తిరుపతిలో “అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” ర్యాలీని విజయవంతం చేద్దాం అని వారు పిలుపునిచ్చారు.
అభివృద్ధి ప్రధాత, భారత రత్న, మాజీ ప్రధాని వాజపేయి శత జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గారు చేపడుతున్న “” అటల్ -మోదీ సుపరిపాలన యాత్ర ఈ నెల 14న తిరుపతికి చేరుకొని వాజపేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పత్రికా విలేకరుల సమావేశంలో పిలుపును ఇవ్వడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నేతలు గుండాల గోపినాథ్ రెడ్డి,
కోలా ఆనంద్, భాను ప్రకాష్ రెడ్డి, జల్లి మధుసూదన్, డాక్టర్ శ్రీధర్, గాలి పుష్పలత, నాయకులు వరప్రసాద్, నాదముని తదితరులు పాల్గొన్నారు.
