లబ్ధిదారులకు రెండు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు

TEJA NEWS

లబ్ధిదారులకు రెండు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన చాకిలం పద్మావతి, బండారి దేవి, చింత ప్రకాశ్, నారెండ్ల ప్రకాష్ గౌడ్ గతంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిఎం సహాయానిధి కింద దరఖాస్తు చేసుకున్నారు. వారికి తన నివాసం వద్ద రెండు లక్షల రూపాయల సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేశారు..

అనంతరం అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేద ప్రజలు సిఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు..

ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…

సిఎంఆర్ఆఫ్ నిరుపేదలకు అండగా మారిందాన్నారు..

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అలాగే మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో ప్రజాపాలన ద్వారా బడుగు,బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంన్నారని కొనియాడారు..

ప్రజాపాలనలో పేద,మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా కార్పొరేట్ రంగంలో వైద్యం అందించడంతో పాటు వైద్యనికి అయినా ఖర్చులు సిఎంఆర్ఆఫ్ ద్వారా పేదలకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఖాజా, రాజి రెడ్డి, సంతోష్, ప్రశాంత్ గౌడ్, కూన రాఘవేందర్ గౌడ్, పద్మ, కరుణ మరియు లబ్దిదారులు, నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top