పేట మండలం వద్ద రోడ్డు ప్రమాదం

TEJA NEWS

పేట మండలం వద్ద రోడ్డు ప్రమాదం

లారీ బోల్తా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

చిలకలూరిపేట మండలం లింగం గుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వైపునకు విద్యుత్ స్తంభాలు లోడుతో వస్తున్న ఒక KA 01 AM 6399 నెంబర్ గల భారీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
గేదెలను తప్పించబోయి
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, లారీ లింగం గుంట్ల ప్రాంతానికి చేరుకోగానే, రహదారిపై అడ్డుగా ఉన్న గేదెల మందను తప్పించే క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో లోడుతో ఉన్న లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది.
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.

You cannot copy content of this page

Scroll to Top