కాంగ్రెస్ తోనే అభివృద్ధి సర్పంచ్ వార్డు సభ్యుల గెలుపు బాధ్యత స్థానిక నాయకులదే : ఎమ్మెల్యే జారే

TEJA NEWS

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సర్పంచ్ వార్డు సభ్యుల గెలుపు బాధ్యత స్థానిక నాయకులదే : ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ములకలపల్లి మండలంలో
14 వ తారీఖు జరుగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యులతో గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే గ్రామాల వారీగా అభ్యర్థుల పరిస్థితి ప్రజల అభిప్రాయాలు స్థానిక సమస్యల పరిష్కారాలపై నాయకులతో చర్చించారు. గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top