గుంటూరు నగరంలోని 51వ డివిజన్ స్థానిక శ్రీనగర్ 7వ లైన్ బుద్ధుడి విగ్రహం వద్ద.. డివిజన్ అధ్యక్షులు గాజల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చాయ్ విత్ జనసైనిక్స్’ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ , జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు , రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు తో కలిసి పాల్గొనడం జరిగింది.
ముందుగా 51 వ వార్డులో జనసేన నాయకులతో, జనసైనికులతో సందర్శించడం జరిగింది. వాడవాడలా తిరుగుతూ.. ప్రజలతో మమేకమవుతూ.. వారి నుండి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
అనంతరం ‘చాయ్ విత్ జనసైనిక్స్’ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సమస్యలు.. సిమెంట్ రోడ్, వాటర్ పైప్ లైన్, ఇళ్ల పట్టాలు తదితర సమస్యలను స్థానికులు జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు సైతం ఈ అంశాలను చాయ్ విత్ జనసైనిక్స్ చర్చా వేదికలో తెలియజేశారు. వారి సమస్యలను పరిగణంలోకి తీసుకుని సంబంధిత అధికారులకు తెలియజేసి 51వ వార్డులో ఉన్న సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా జనసేన పార్టీ తరపున కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు సమాయత్తం కావాలని పిలుపునివ్వడం జరిగింది. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిగా అభ్యర్థి ఏ పార్టీ వారైనా కానీ కూటమి అభ్యర్థిగా వారిని స్వీకరించి, కూటమి గెలుపుకి కృషి చెయ్యాలని.. గుంటూరు నగరంలో జనసేన పార్టీ బలం చూపించే అవకాశాన్ని అందరం వినియోగించుకుందామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని ఆచరణలో చేసి చూపిద్దామని దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ నాయకులు, నగర కమిటీ నాయకులు, డివిజన్ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
అడపా మాణిక్యాలరావు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ఉప అధ్యక్షులు.
