డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించి సమస్యను పరిష్కరించాలి

TEJA NEWS

డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించి సమస్యను పరిష్కరించాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

132 – జీడిమెట్ల డివిజన్ దండమూడి ఎంక్లేవ్, జీడిమెట్ల గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో మురుగునీరు లీకేజీ సమస్యను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ…. ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని, నువ్వు నేటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే భూగర్భ డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచి కొత్త లైన్లను నిర్మించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు కాలే నాగేష్, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, తోకల నాగేష్ రెడ్డి, సమ్మయ్య నేత, కాలే గణేష్, శ్రీకాంత్, బాల మల్లేష్, విజయ్ హరీష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top