నూతన సర్పంచు విజేతలకు శుభాకాంక్షలు, ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

TEJA NEWS

నూతన సర్పంచు విజేతలకు శుభాకాంక్షలు, ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
వనపర్తి
మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన బి.ఆర్.ఎస్ 34మంది సర్పంచులను మరియు వార్డు సభ్యులను ఆయన నివాసంలో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
అధికార పార్టీ అరాచకాలకు దౌర్జన్యాలకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.


కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికలలో ప్రస్పుటించిందని రాబోయేది బి.ఆర్.ఎస్ ప్రభుత్వము అని స్పష్టమైందని అన్నారు.
గెలిచిన సర్పంచులు కష్టపడి పని చేసి ప్రజల మన్ననలు పొందాలని విజ్ఞప్తి చేశారు.
రాబోవు ప్రభుత్వంలో అండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top