పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

TEJA NEWS

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత …………..జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజిని.

వనపర్తి

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం బసవన్న గడ్డలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి నిర్వహకులకు మరియు పిల్లల తల్లిదండ్రులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ వాయు కాలుష్యం వలన, పలు రకాలైన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి అని అలాగే ఉష్ణోగ్రతలు తగ్గడం వలన వాతావరణంలో వచ్చే మార్పుల వలన చిన్న పిల్లలు మరియు వృద్ధులు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని, కావున ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలను పాటించాలని సూచించారు.

జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సుధారాణి మాట్లాడుతూ అంగన్వాడీల నిర్వహణల గురించి మరియు వాతావరణానికి అనుగుణంగా పిల్లల రక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలియజేశారు. డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ తల్లిదండ్రులు శీతాకాలంలో పిల్లల విషయంలో పాటించవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, డాక్టర్ మతిన్ మరియు అంగన్వాడి కేంద్రం ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top