బస్తి దవాఖానాల్లో డాక్టర్ కుర్చీకి దుమ్ము పట్టింది…

TEJA NEWS
  • బస్తి దవాఖానాల్లో డాక్టర్ కుర్చీకి దుమ్ము పట్టింది…
  • 6నెలలుగా బస్తి దవాఖానాల్లో డాక్టర్ లు లేరు…
  • బస్తి దవాఖానలకే సుస్థి తెచ్చిన ప్రభుత్వం…
  • బస్తి దావఖానాల్లో మందులు లేవు.. డాక్టర్ లు లేరు..
  • మెడికల్ ఆఫీసర్ రూమ్ లో పెచ్చులు ఊడిన పట్టించుకొనే నాథుడు లేడు..
  • డాక్టర్ రాక కుర్చీ దుమ్ము పట్టి తీర బస్తీ దవాఖానలది..
  • సిద్దిపేట లో ఉన్న 4 బస్తీ దవాఖాన లో 3 బస్తి దవాఖానాల్లో డాక్టర్ లు లేరు…
  • అటెండర్స్ జీతాలు లేక మూడు నెలల అవుతుంది.. స్టాఫ్ నర్స్ కు నవంబర్ నెల జీతం రాలేదు…
  • ప్రజా వైధ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
  • సిద్దిపేట బస్తి దవఖాన ను ఆకస్మికంగా సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు…

సిద్దిపేట పట్టణం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు.. ఈ సందర్బంగా బస్తీ దవాఖాన లో ఉన్న స్టాఫ్ నర్స్ తో మాట్లాడారు.. గత ప్రభుత్వం లో సిద్దిపేట లో 4 చోట్ల బస్తి దవాఖానలు ఏర్పాటు చేసుకున్నామని ఒక్క కెసిఆర్ నగర్ లోని బస్తి దవాఖాన లో మినహాయించి మిగతా మూడు బస్తి దవాఖానలు కాళ్లకుంట కాలనీ, లింగారెడ్డి పల్లి, ఆర్ అండ్ బి కార్యాలయం సమీపంలో లోన్న వాటిల్లో గత 6 నెలల నుండి డాక్టర్ లు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు.. డాక్టర్ లేక మెడికల్ ఆఫీసర్ రూమ్ పెచ్చులు ఊడిపోయి, డాక్టర్ కూర్చునే కుర్చీలో దుమ్ము పట్టి ఉండటం పట్ల ఇదేనా బస్తి దవాఖాన తీరని, డాక్టర్ లు లేకుండా ప్రజలకు వైద్యం ఎలా అందిస్తారన్నారు..

పేద ప్రజల కోసం బస్తి దవాఖాన లను ఏర్పాటు చేస్తే వాటిని స్తుస్తి దవాఖాన లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు.. ఒక వైపు 6నెలలు గా డాక్టర్ రావడం లేదని..మరో వైపు ఉన్న అటెండర్ కు మూడు నెలలు గా జీతాలు రావడం లేదు.. ఉన్న స్టాఫ్ నర్స్ కు నవంబర్ నెల జీతం ఇప్పటికి రాలేదని సీరియస్ అయ్యారు.. దవాఖాన మందుల గురించి అడిగి తెల్సుకున్నారు.. మల్టి విటమిన్, లోప్రై మెడ్ ( మోషన్స్ ట్యాబ్లేట్ ), లివో సిట్రిజన్ జలుబు ట్యాబ్లేట్, షూగర్ ట్యాబ్లేట్ మెటఫిన్ తో పాటు ఉండాల్సిన గ్లిమి ఫిరైడ్ 2mg లేవని , అదేవిదంగా చిన్న పిల్లలకు సంబందించిన జింక్ సల్ఫేట్ లేవన్నారు.. డాక్టర్ వస్తా లేడు.. మందులు లేవు.. అలాంటప్పుడు ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయని.. పేద ప్రజలకు అందించే ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్యం విడాలని వేంటనే బస్తి దవాఖాన లో వైద్యులను ఏర్పాటు చేయాలనీ సకాలంలో మందుల అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసారు..

You cannot copy content of this page

Scroll to Top