భ్రమరాంబిక నగర్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

TEJA NEWS

భ్రమరాంబిక నగర్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
▪️ ఐక్యత, ప్రేమకు ఏసుక్రీస్తు బోధనలు మార్గదర్శకం : కాట శ్రీనివాస్ గౌడ్

అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని భ్రమరాంబిక నగర్ కాలనీలో ఐపీసీ హెర్మోన్ ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ వేడుకకు పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరసోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసుక్రీస్తు బోధనలు ప్రేమ, కరుణ, క్షమ అనే విలువలతో సర్వమానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తే సమాజంలో శాంతి, ఐక్యత వెల్లివిరుస్తాయని అన్నారు.

You cannot copy content of this page

Scroll to Top