అల్విన్ కాలనీ డివిజన్ పాస్టర్లకు క్రిస్మస్ కనుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

TEJA NEWS

అల్విన్ కాలనీ డివిజన్ పాస్టర్లకు క్రిస్మస్ కనుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

క్రిస్మస్ పండుగ శుభసందర్బంగా 124 అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి వారి కార్యాలయంలో డివిజన్లో ఉన్న సుమారు 60 మంది పాస్టర్ల కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు అందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణ లతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని అన్నారు. అల్విన్ కాలనీ డివిజన్ లోని పాస్టరలందరు ఎంతో ప్రేమ చూపిస్తూ నాకోసం మరియు మా కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారాని గుర్తుచేసారు. డివిజన్ ప్రజలందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి, మోజెస్, పాస్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top