రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశం
జనవరి లో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు తీసుకోవాల్సిన కార్యాచరణ , రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ , తదితర అంశాలపై చర్చ..
సమీక్షా సమావేశంలో పాల్గొన్న రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జెటిసి లు రమేష్ , చంద్రశేఖర్ , శివ లింగయ్య, డిటిసి లు ,ఎంవీఐ లు , ఏఎంవీఐ, ఆర్టీఏ సభ్యులు ఇతర అధికారులు
మంత్రి పొన్నం ప్రభాకర్
జనవరి 1- 30 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఐఏఎస్,ఐపీఎస్ లు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రతి ఒక్కరు పాల్గొనేలా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి..
ప్రతి గ్రామం నుండి స్కూల్ లు ,కాలేజీలు ప్రతి విద్యార్థి రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ చేయాలి..
రోడ్డు భద్రత మాసోత్సవం లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 ఉండాలి..
విద్యార్థులకు ,డ్రైవర్లకు ప్రతి పౌరునికి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలి..
Nss, లయన్స్ క్లబ్,రోటరీ క్లబ్ లు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి వారికి జనవరి 26 న ప్రశంస పత్రాలతో సత్కరించాలి..
రోడ్డు భద్రత మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా రంగోలి కార్యక్రమాలు ,క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు చేయించాలి..
బైక్ ర్యాలీలు , బ్లడ్ డొనేషన్ క్యాంపులు ,వాక్ థన్ ర్యాలీలు నిర్వహించాలి..
జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ లు సమావేశాలు నిర్వహించాలి..
ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి వాటిని తొలగించాలి
ఆర్టీఏ సభ్యులు రోడ్డు భద్రత కార్యక్రమాలకు జిల్లాల్లో విసృత ప్రచారం కల్పించాలి..
