జగన్ పాపాల ఫలితమే ప్రజల్ని పీడిస్తున్న భూ సమస్యలు : ప్రత్తిపాటి
- ఏడాదిన్నరైనా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదంటే .. జగన్ ఏస్థాయిలో చిక్కులు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.
- హద్దురాళ్లు, పాస్ పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల తారుమారుతో, ప్రజలకు.. ప్రభుత్వ వ్యవస్థలకు తలనొప్పులు సృష్టించాడు.
- నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లకు ఆస్కారం లేదు. రాజమార్గంలో అన్ని అనుమతు లుండటమే అందరికీ మంచిది.
- మాజీ అవినీతిమంత్రి, ఆమె అనుచరులు, కుటుంబసభ్యులు కాలువలు, చెరువులు, డొంకలు, జాతీయ రహదారి భూముల్ని కూడా ప్రజలకు అంటగట్టి.. పరారయ్యారు.
- స్వయం సహాయక సంఘాల సొమ్ము కాజేసిన వారు.. డబ్బు తిరిగి చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు.
- ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ ) నిర్వహించి, మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
జగన్ పాపాల పాలన ఫలితమే ప్రజల్ని పట్టి పీడిస్తున్న రెవెన్యూ, ఇతర భూ సమస్యలని, వాటి పరిష్కారంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బార్) లో భూ వివాదాలకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయాలని సూచించారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లా రావు తెలిపారు.
శుక్రవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, మీడియాతో మాట్లాడారు.
ప్రజల ఆస్తుల జోలికి పోయినందుకే జగన్ ఇంటికిపోయాడు..
సర్వేనంబర్లు, రికార్డుల తారుమారుతో ప్రజలకు చెందిన తాతముత్తాతల కాలం నాటి ఆస్తుల జోలికి పోయినందుకే జగన్ ఇంటికి పోయాడన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని దిగమింగింది కాక.. ప్రజల ఆస్తుల్ని కాజేసే ప్రయత్నంలో, జగన్ రాష్ట్రంలోని భూముల హద్దులు, సర్వేరాళ్లు, పాస్ పుస్తకాల మార్పులతో తప్పులమీద తప్పులు చేయించాడన్నారు. ఒకసారి ఒకరిపేరుపై నమోదైన ఆస్తిని తిరిగి మార్చాలంటే చాలా జఠిలమని, ఏడాదిన్నర అయినా జగన్ సృష్టించిన సమస్యలు పరిష్కారం కాలేదంటే, రెవెన్యూ వివాదాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ కూడా బాధ్యతాయుతంగా పరిష్కరించే దిశగా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు.
టిడ్కో సముదాయంలోనే రేషన్, పింఛన్ల పంపిణీ.. వైద్యసేవలు
టిడ్కో గృహ సముదాయంలోని 4,512 ఇళ్లల్లో 3వేలకు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయని, గతంలో ఎలక్ట్రానిక్ విధానంలో గృహాల కేటాయింపు జరిగినందున, ఎక్కువ మంది పైన ఉండటానికి ఇప్పుడు విముఖత చూపుతున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. టిడ్కో సముదాయ ప్రాంగణంలోనే ప్రత్యేక రేషన్ దుకాణం, పింఛన్ల అందజేత నిమిత్తం ఒక సచివాలయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరామని, అలానే వైద్యసేవల నిమిత్తం వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ వోకు సూచించినట్టు ప్రత్తిపాటి చెప్పారు.
డ్వాక్రా, మెప్మా సంఘాల సొమ్ము కాజేసిన వారు తిరిగి చెల్లించాల్సిందే
స్వయం సహాయక సంఘాల్లోని (డ్వాక్రా, మెప్మా సంఘాలు) సభ్యులకే తెలియకుండా జగన్ ప్రభుత్వంలో జరిగిన మోసాల్ని ఉపేక్షించేది లేదని, అక్రమంగా డబ్బు కాజేసిన ప్రతి ఒక్కరినుంచి సొమ్ము రికవరీ చేయిస్తామని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. సమస్య తీవ్రతను కలెక్టర్ ఇప్పటికే ముఖ్యమంత్రికి తెలియచేశార ని, మహిళలకు తెలియకుండా డబ్బు కాజేసినవారు, తప్పు గ్రహించి సొమ్ము తిరిగి చెల్లించడం వారికే మంచిదని ప్రత్తిపాటి హెచ్చరించారు. అసమర్థపు ముఖ్యమంత్రి అవినీతి పాలన ప్రభావం వల్లే సహకార, స్వయం సహాయక సంఘాల్లో కూడా అవకతవకలు జరిగాయని ప్రత్తిపాటి తెలిపారు. బ్యాంకులకు తెలియకుండానే నిధులు కాజేయడమంటే సామాన్య విషయం కాదన్నారు.
అవినీతి మంత్రి రియల్ దందా.. ప్రజల్ని రోడ్లపాలు చేసింది
గత ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన అవినీతి మంత్రి, ఆమె బంధువులు, అనుచరులు భూములపై గీతలు గీసి, లేఅవుట్ల పేరుతో ప్రజల్ని నిలువునా వంచించారని ప్రత్తిపాటి తెలిపారు. నాగార్జున సాగర్ కాలువ గట్టు సహా.. ఇతర కాలువలు, చెరువులు, డొంకల్ని కూడా వదలకుండా ప్లాట్ల పేరిట ప్రజలకు అంటగట్టారన్నారు. నాడు ప్రజలకు మాయమాటలు చెప్పి, అక్రమ లే అవుట్లను వారికి కట్టబెట్టి సొమ్ము చేసుకొనికనిపించకుండా పోయారన్నారు. గత ఐదేళ్లలో నియోజకవర్గవ్యాప్తంగా ఈ దందాను కొనసాగించిన వారి స్వలాభం.. నేడు పట్టణాభివృద్ధికి అడ్డంకిగా మారి, ప్రజల్ని రోడ్లపాలు చేసిందన్నారు. గత ఐదేళ్లలో మాజీ అవినీతి మంత్రి, వారి అనుచరులు, కుటుంబసభ్యులు ప్రజల్ని దోచేసి సంతోషంగా ఉన్నారని, వారి మూలంగా నష్టపోయిన ప్రజలు నానా అవస్దలు పడుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. గత ఐదేళ్లలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల వివరాలు బయటకు తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. అన్ని నిబంధనలు, అనుమతులతో రాజమార్గంలో ప్లాట్లు అమ్ముకునేలా విధానాలు రూపొందించామన్నారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, పట్టణ సీఐ రమేష్, అధికారులు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
