ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి సేవాదళ్ : ఎమ్మెల్యే జారే

TEJA NEWS

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి సేవాదళ్ : ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం చండ్రుగొండ మండల కేంద్రంలోని ఎస్ ఆర్ ప్రయివేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, సేవాదళ్ ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులతో కలసి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముకలాంటిదని పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల మధ్య ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఘనత సేవాదళ్‌కే దక్కుతుందని తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడటం పార్టీ విధానాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో సేవాదళ్ పాత్ర కీలకమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవాదళ్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top