నూతన సంవత్సర 2026 వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

TEJA NEWS

నూతన సంవత్సర 2026 వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

జోగులాంబ గద్వాల జిల్లా
జిల్లా కేంద్రంలోని నూతన సంవత్సర 2026 వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ గారు తెలిపారు.

నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం సేవించి వాహనం నడిపితే వాహనం సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా మరియు కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్‌లు, అతివేగంగా వాహనాలు నడపడం, సైలెన్సర్లు తొలగించి శబ్దం చేయడం నిషేధం. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం. డీజే శబ్ద కాలుష్యం కలిగించే డీజేలు, అధిక శబ్దంతో మ్యూజిక్ సిస్టమ్‌లకు అనుమతి లేదు.
అసభ్య ప్రవర్తన రహదారులపై గుంపులు గుంపులుగా చేరి ఇతరులకు అసౌకర్యం కలిగించడం, అసభ్యంగా ప్రవర్తించడం నేరం. న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో వచ్చే ఫేక్ లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దు. బ్యాంక్, ఓటీపీ వివరాలు ఎవరికీ ఇవ్వకండి.

సహకారం: పోలీస్ తనిఖీలకు ప్రజలు సహకరించాలి. మీ క్షేమమే మా బాధ్యత. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని గద్వాల పట్టణ పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 📞100 లేదా గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి.

కళ్యాణ్ కుమార్
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
గద్వాల పట్టణం

You cannot copy content of this page

Scroll to Top