ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఘనంగ పుట్టినరోజు వేడుకలు

TEJA NEWS

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఘనంగ పుట్టినరోజు వేడుకలు

వనపర్తి :

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో రికార్డ్ స్థాయిలో రక్త సేకరణ జరిగింది

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం యువశక్తి ఫౌండేషన్ సమన్వయం ద్వారా 482 యూనిట్ల రక్తాన్ని స్వీకరించినట్టు అధికారులు పేర్కొన్నారు

గతంలోనూ ఎమ్మెల్యే మేఘా రెడ్డి పుట్టినరోజు సందర్భంగానే రికార్డ్ స్టైల్ రక్త చేతన జరిగిందని మళ్లీ నేడు నియోజకవర్గంలో అదే రికార్డు స్థాయిలో 482 జరగడం హర్షించదగ్గ విషయమని వారన్నారు

శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పుట్టినరోజు వేడుకలను వనపర్తి నియోజకవర్గం మొత్తంలో ఘనంగా నిర్వహించారు

ఎమ్మెల్యే మొదటగా ఖిల్లా ఘణపురం మండలం గట్టు కాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు

అనంతరం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో మండల నాయకులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన కుటుంబ సమేతంగా కేకునుకోసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు

ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

అనంతరం ఖిల్లా ఘణపురం మండలం మానాజీపేట గ్రామ స్టేజీ వద్ద గ్రామస్తులు ఎమ్మెల్యే కి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేకును పోసి శుభాకాంక్షలు తెలియజేశారు

  • వృద్ధులకు అన్నదాన పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే*

వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులోని చేయూత అనాధాశ్రమం వారు వృద్ధులకు భోజన పంపి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు

ఇందుకుగాను ఎమ్మెల్యే వృద్ధులకు భోజనాన్ని సరఫరా చేసేందుకు కావలసిన వాహనాన్ని గతంలోనే అనారాశ్రమానికి వితరణ చేశారు

ఈ క్రమంలో ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో అనాధ వృద్ధులకు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు

అనంతరం పామిరెడ్డిపల్లి పాఠశాలలో విద్యార్థులకు మూర్పుష్యకాలను పెన్నులను పంపిణీ చేశారు

అనంతరం వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల మధ్యన మార్కెట్ యార్డ్ కార్మికుల మధ్యన ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా హాజరయ్యారు

ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికులు కేకును కోసం ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

  • విద్యార్థుల మధ్యన పుట్టినరోజులు వేడుకలు*

వనపర్తి పట్టణంలోని మరికుంట లో గల బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కేకునుకోసి శుభాకాంక్షలు తెలియజేశారు

విద్యార్థులకు తక్షణ అవసరార్థం రెండు లక్షల రూపాయల విలువగల డిజిటల్ బోర్డును తన సొంత నిధులతో ఏర్పాటు చేయిస్తానని చెప్పారు

గిరిజన గురుకుల పాఠశాల అభివృద్ధి అభివృద్ధి కోసం మూడు కోట్ల రూపాయలను మంజూరు చేయించామని చెప్పారు

పాఠశాల అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో దృశ్య సారిష్టమని ఎమ్మెల్యే పేర్కొన్నారు

అనంతరం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మేఘా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. ప్రముఖులు అధికారులు యువకులు, మహిళలు ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వనపర్తి పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్లు వైస్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు పట్టణ నాయకులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారూ.

You cannot copy content of this page

Scroll to Top