మన ప్రభుత్వంలో రైతే రారాజు .
కోవూరుఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. కోవూరు మండలానికి సంబంధించి 2 వేల 424 పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట ప్రభుత్వ రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల భూములకు సిఎం చంద్రబాబు నాయుడు రైతుల భూములకు భద్రత కల్పించారన్నారు. అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన పట్టాదార్ పాస్ బుక్ పై గల క్యు ఆర్ కోడ్ స్కాన్ చేసి భూమి వివారాలు తెలుసుకోవచ్చని సర్వే నెంబర్లు, పేర్లలో ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే సరిదిద్దుకోవచ్చు అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక దశాబ్దాల తరబడి పూడికలు తీయని కాలువలను కొన్ని ప్రభుత్వ పరంగాను మరికొన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బాగు చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించామన్నారు. గతమెన్నడు లేనివిధంగా గిట్టుబాటు ధర కల్పించి, ధాన్య సేకరణ చేసిన 24 గంటలలో రైతుల ఖాతాలలో హమాలీ కూలీలతో సహా వేసిన ఘనత చంద్రబాబు నాయుడు కే దక్కుతుందన్నారు. మూడు విడతలుగా 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణి చేసి సన్నకారు రైతులను ఆదుకున్నాంమన్నారు. రైతుల అవసరాలను గుర్తించి యూరియా పంపిణి చేయడంలో వ్యవసాయశాఖ అధికారులు చూపిస్తున్న చొరవను వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో కోవూరు తహసీల్దారు వెంకటసుబ్బయ్య,పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి,జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి,ఎంపీపీ తుమ్మల పార్వతి, కోవూరు సర్పంచ్ ఏకశిరి విజయ,కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, దారపనేని శ్రీనివాస నాయుడు,దాసరి మురళి, బత్తల రమేష్, షేక్. ఫిరోజ్ జనసేన బిజెపి నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, సుబ్బారావు, తో రైతులు, కూటమి మీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
