టౌన్ 2 సెక్షన్ లలో 30బ్యాచ్ లుగా విద్యుత్ దాడులు
6,30,000/అపరాధ రుసుము
చిలకలూరిపేట టౌన్ 2 సెక్షన్ పరిధిలో సి ఆర్ డి ఎ సర్కిల్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ యమ్. శ్రీనివాస్ నేతృత్వంలో గుంటూరు టౌన్ 2 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు,డీ పి ఈ & విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.ఎ.కరీమ్ ఆధ్వర్యంలో టౌన్ 2 సెక్షన్ లలో 30బ్యాచ్ లుగా విద్యుత్ దాడులు నిర్వహించి అనధికారికంగా అధిక లోడు విద్యుత్ వినియోగము చేసుకుంటున్న 117సర్వీసులకు మొత్తం రు. 6,30,000/అపరాధ రుసుము వేసినారు 1.అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న 5సర్వీస్ లకు రు. 53,000/- విద్యుత్ కనెక్షన్ లేకుండా డైరెక్ట్ గా లైన్ల మీద వేసి వాడుకున్న 2 సర్వీస్ లకు 2,000/- మరియు గృహ వినియోగమునకు విద్యుత్ కనెక్షన్ తీసుకొని వాణిజ్యం నకు వాడుకుంటున్న 7 సర్వీస్ లకు రు. 70,000/-, రీడింగులో తేడా గమనించిన 1 సర్వీస్ కు రు.25,000/-, అదనపు లోడ్ వినియోగించుకుంటున్న 102 సర్వీస్ లకు రు.4,80,000/- మొత్తం రూ 6,30,,000/- అపరాధ రుసుము కింద జరిమానా విధించటం జరిగింది.విద్యుత్ చౌర్యం అనేది సామాజిక నేరం కింద పరిగణింప బడుతుంది దానికి జైలు శిక్ష కూడా ఉంటుంది రాబోవు రోజులలో ఉన్నత అధికారుల ఆదేశాలతో అనధికార విద్యుత్ వినియోగం చేసినట్లయితే కేసు లు కూడా బుక్ చేస్తామని తరుచుగా దాడులు నిర్వహిస్తామని వారు చెప్పినారు. ఈ దాడులలో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్స్ A.గురునాధ రావు గారు, యన్ . మల్లికార్జున ప్రసాద్,కె.రవి కుమార్ మరియు 11 మంది అసిస్టెంట్ ఇంజనీర్స్ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నట్లు, చిలకలూరిపేట టౌన్ 2 అసిస్టెంట్ ఇంజనీర్ కె.లావణ్య, డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్ తెలిపారు.
