నూతనకల్ మండల రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

TEJA NEWS

నూతనకల్ మండల రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

సూర్యపేట జిల్లా ప్రతినిధి: నూతనకల్ మండలంలోని అన్ని గ్రామాల రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా, పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూధార్ పథకంతో పాటు భవిష్యత్తులో అమలు చేయనున్న వివిధ వ్యవసాయ పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి అని మండల వ్యవసాయ శాఖ తెలియజేసింది. రైతులు తమకు సమీపంలోని ఏ మీసేవా కేంద్రంలోనైనా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు.

ఈ నేపథ్యంలో రైతుల మొబైల్ ఫోన్లకు వస్తున్న సందేశాలు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను తెలియజేయడానికే వ్యవసాయ శాఖ ద్వారా పంపించబడినవని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో రైతులు ఆధార్ కార్డుతో పాటు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను (OTP కోసం) తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది 16-01-2026 మాత్రమేనని, నిర్ణీత గడువులోపు రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాల లబ్ధికి అనర్హులుగా పరిగణించబడతారని హెచ్చరించారు. కావున భూమి పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్షణమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.

బి. జానయ్య మండల వ్యవసాయ అధికారి నూతనకల్

You cannot copy content of this page

Scroll to Top