మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ అవినాష్ మహంతి( IPS)

TEJA NEWS

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ అవినాష్ మహంతి( IPS) ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని శాంతి భద్రతల పరిస్థితి, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పోలీస్ శాఖతో సమన్వయం పెంచుతూ ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు కలిసి పనిచేయాలని ఇరువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోళ్ళురీ అంజయ్య, మేకల మధు సుధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top