గిగ్ వర్కర్లపై అన్యాయంగా అమలు చేస్తున్న “పది నిమిషాల డెలివరీ” వంటి నిబంధనలను తొలగించడాన్ని ప్రజాస్వామ్య విజయంగా టీపీసీసీ లేబర్ వింగ్ ఇన్చార్జ్, వైస్ ప్రెసిడెంట్ సంగీశెట్టి జగదీశ్వరావు అభివర్ణించారు.
దేశవ్యాప్తంగా సాగిన గిగ్ వర్కర్ల పోరాట ఫలితంగానే ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు.
గిగ్ వర్కర్ల హక్కులు, భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని అన్నారు.
గిగ్ వర్కర్ల హక్కులు, భద్రత, గౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ మరియు శ్రీ రాహుల్ గాంధీ పోరాటం చేస్తోందని ఆయన గుర్తు చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాలకే ఉపయోగపడే విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన పోరాటమే ఈ విజయానికి కారణమని తెలిపారు.
