శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు భోగి ,సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ అరెకపూడి గాంధీ
భోగి పర్వదినం సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసంలో జరిగిన భోగి వేడుకలలో పాల్గొని భోగి మంటలు వేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు,ప్రజాప్రతినిధులకు ,కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనాధికారులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు మరియు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందోత్సాహల మధ్య భోగి పండగను జరుపుకోవాలాని మనసారా కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ అని ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు అని. అంతే కాకుండా ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు అని అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి.. కొత్తమార్గంలోకి పయనించాలని దీని అర్థం అని PAC చైర్మన్ గాంధీ తెలియజేసారు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ అని, ప్రజలందరు సుఖ సంతోషాలతో చక్కటి వాతావరణంలోఆనందయకంగా కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందోత్సాహల మధ్య భోగి పండగను జరుపుకోవాలాని మనసారా కోరుకుంటూ మరోసారి మీకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ పేర్కొన్నారు.
