తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం – ఉపాధ్యాయురాలు మృతి

TEJA NEWS

తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం – ఉపాధ్యాయురాలు మృతి

….

సూర్యపేట జిల్లా : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని అర్వపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు రీఓపెన్ కావడంతో నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో కారు అదుపుతప్పి రోడ్డుపక్కన పల్టీలు కొట్టి పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ప్రయాణిస్తుండగా, అందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటనలో ఉపాధ్యాయురాలు కల్పన స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ఇద్దరు హెడ్మాస్టర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో రావులపల్లి హెడ్మాస్టర్ తోపాటు హెడ్మాస్టర్ తులసి ఉన్నారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. మృతురాలి కుటుంబానికి జిల్లా వాసులు సంతాపం తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top