శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
126 – జగద్గిరిగుట్ట డివిజన్ జగద్గిరిగుట్టపై కొలువున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 55వ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ… ఈనెల 22 అనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు అద్వితీయంగా నిర్వహించే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయడంతో పాటు స్వామివారి కృపాకటాక్షాలు పొందాలన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల బ్రహ్మోత్సవాలలో భాగంగా 23న నిర్వహించనున్న శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, దేవాలయ కమిటీ డైరెక్టర్లు వేణు గౌడ్, రవీందర్, సంజీవ్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రాజు, మహిళా నాయకురాలు ఇందిరాగౌడ్, సీనియర్ నాయకులు విఠల్, దాసు, మల్లేష్ గౌడ్, జైహింద్, రాజు, పాపులు గౌడ్, అంజయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
