అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ భద్రత

TEJA NEWS

అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ భద్రత మహోత్సవాలలో భాగంగా “అరైవ్–అలైవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలానగర్ డివిజన్ ఏసీపీ నరేష్ రెడ్డి మరియు గిరి ప్రసాద్ ఏసీపీ ట్రాఫిక్ కుకట్పల్లి డివిజన్ మరియు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లు ముఖ్య అతిథిగా హాజరై, రోడ్డుపై ప్రయాణించే పౌరులు తప్పనిసరిగా పాటించాల్సిన రోడ్ భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ:-
1.రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రతా నియమాలను తుచా తప్పకుండా పాటించాలని సూచించారు.

2.రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని కోరారు.

3.వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతో ముఖ్యమని తెలిపారు.

4.ప్రత్యేకంగా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు, మద్యం సేవించి డ్రైవింగ్ చేయ వద్దు, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ ధరించకపోవడం వంటి నిర్లక్ష్యపు చర్యలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని స్పష్టం చేశారు.

5.అలాగే, హెల్మెట్ ధరించినా దాని బెల్ట్‌ను సరిగా పెట్టుకోకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగినప్పుడు చాల మంది మరణిస్తున్నారని గుర్తు చేశారు.

6.మైనర్ అబ్బాయిలకు గాని, అమ్మాయిలకు గాని నడపడానికి వాహనాలు ఇవ్వవద్దని తెలిపినారు.

ఈ కార్యక్రమంలో అల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top