రాజీవ్ గాంధీ నగర్ మరియు మొగులమ్మ కాలనీ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

TEJA NEWS

రాజీవ్ గాంధీ నగర్ మరియు మొగులమ్మ కాలనీ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ మరియు మొగులమ్మ కాలనీలలోని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ మరియు మొగులమ్మ కాలనీలలో కొంతమేర డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కాలనీలలో కొన్నిచోట్ల డామేజ్ అయిన మన్ హోల్ మూతలను వెంటనే మర్చి కొత్తవి అమర్చాలని సంబంధిత అధికారులకు తెలియచేసారు. డివిజన్ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, కాలనీలో పెండింగ్లో ఉండి అసంపూర్తిగా మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, జి. రవి, గోపాల్, CH.భాస్కర్, పోశెట్టిగౌడ్, గుడ్ల శ్రీనివాస్, జాన్, ఇంతియాజ్, ధనుంజయ్, ప్రసాద్, శామ్యూల్, షేక్ బీబీ, మజర్, లింగం, సుధాకర్, సత్తయ్య, రమేష్, రాజు గౌడ్, మహేష్, రవీందర్, ఖలీమ్, నాగార్జున.

జి.ఎచ్.ఎమ్.సి అధికారులు ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, UBD నాగరాణి, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ శివ, ఎస్.ఎఫ్.ఎ వెంకటరెడ్డి & మల్లేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top