వసంత పంచమి పురస్కరించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసాలు

TEJA NEWS

వసంత పంచమి పురస్కరించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.

శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ లోని సన్ షైన్ గ్లోబల్ స్కూల్ చైర్మెన్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వసంత పంచమి మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సరస్వతీ పూజలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం తన ఒడిలో చిన్నారిని కూర్చోబెట్టుకుని చేశారు.

కార్పొరేటర్ మాట్లాడుతూ.. చదువుల తల్లి జ్ఞాన స్వరూపిణి శ్రీ సరస్వతి దేవి కరుణకటాక్షాలతో ప్రతిఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాధికా, పురం విష్ణువర్ధన్ రెడ్డి, సన్ షైన్ స్కూల్ టీచర్స్ చిన్మయి, ఉషా, వాణి, సరిత, రాధికా, నీరజ, రమాదేవి విద్యార్థులు వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top