సైబరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీసుల చొరవ..
నంబర్ లెస్ బైక్లు, ఆటోలను ఉపయోగించి నేరాలు చేస్తున్న నేరస్థుల దృష్ట్యా….ఉన్నతాధికారుల ఆదేశాల దృష్ట్య ఈరోజు ఆ విషయంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
RTO కార్యాలయం నుండి మరియు ఇతర కారణాల వల్ల నంబర్ ప్లేట్లు పొందని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్లను అక్కడికక్కడే బిగించాలని తెలియజేశాము. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలను లేదా రిజిస్టర్డ్ నంబర్ యొక్క 1 లేదా రెండు అంకెలను కనిపించకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
