మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
అజిత్ పవార్ మృతి పట్ల బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మృత్యు పట్ల బీ.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎం.పీ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలపై నిరంతరంగా ఉద్యమాలు చేయడం ద్వారా ప్రజా జీవితాన్ని ప్రారంభించి మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నాయకులు ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మృతి చెందడం కలిచి వేసిందని వినోద్ కుమార్ అన్నారు.
దివంగత అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు.
