అంతర్వేది రథయాత్ర
AP: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో మధ్యాహ్నం 2:05 గంటలకు రథోత్సవం వైభవంగా ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సంప్రదాయం ప్రకారం దివ్య మూర్తులను రథంపై కొలువు తీర్చి, భక్తజన సందోహం నడుమ ఊరేగిస్తారు. ఇప్పటికే పుష్పాలు, అరటి గెలలతో రథాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
